శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ తునిలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ అమ్ము వెంకట జోగయ్య శాస్త్రి గారు విచ్చేశారు. వారు మాట్లాడుతూ క్రమశిక్షణ అంటే ఇతరులకు బాధ కలిగించే పనులు చేయకుండా ఉండటం, డబ్బు సంపాదించాలనే కోరిక ఉన్న వారికి గురు బంధం అబ్బదు. ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి ఉన్నవారికి చదువు రాదు. రేపటి పనులు ఈరోజు పూర్తి చేయాలి. మనం ఎవరికైనా నమస్కరించేటప్పుడు ఒక చేత్తో కాకుండా రెండు చేతులతో నమస్కారం చేయాలి. పంచేంద్రియాలు అదుపులో ఉంచుకోవాలి. ఎంత చదివినా ఒదిగి ఉండాలని, విద్య అనేది పుస్తకాలు మాత్రమే చదివితే రాదని దాని ఆచరించడం ద్వారానే వస్తుందని వివరించారు. ఆహారపు టలవాట్లలో కూడా మార్పులు చేసుకోవాలని, క్రీడలు పట్ల ఉత్సాహం కలిగి ఉండాలని ,వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ప్రతిరోజు శతక పద్యాలైన కుమారి శతకం, సుమతి శతకం, వేమన శతకంలోని పద్యాలు ఒకటైన నేర్చుకోవాలని వివరించారు. గిడుగు వెంకట రామమూర్తి గారి జీవితంలో కొన్ని ముఖ్య సన్నివేశాలు, వివిధ సాహితీ ప్రక్రియలు ఆధునిక విద్యా పోకోడలను విద్యార్థులకు వివరించారు. భాగవతంలోని ప్రహ్లాదో పాఖ్యానంలోని ఘట్టాలను విద్యార్థులకు వివరించారు.ముఖ్యఅతిథి శ్రీ అమ్ము వెంకట జోగయ్యశాస్త్రి గారు వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ మాతృ భాషాభిమానాన్ని చాటుకున్నారు.