నేడు తెలుగు భాషా దినోత్సవం. ప్రతీయేటా ఆగష్టు 29 న తెలుగు కవి గిడుగు వేంకట రామమూర్తి జయంతి సందర్భంగా బెండపూడిలో గల శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ పాఠశాలలో తెలుగు భాషాదినోత్సవ సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి తెలుగు భాషోపాధ్యాయిని శ్రీమతి పరానంది లలిత గారు ముఖ్య అతిధిగా విచ్చేసి తెలుగు భాషగోప్పతనం మరియు గిడుగు రామమూర్తి గ్రాంధిక భాషావాదులపై చేసిన తిరుగుబాటును గురించి చక్కగా వివరించడం జరిగింది.అలాగే ఈ కార్యక్రమంలో భాగంగా తెలుగు భాషాదినోత్సవాన్ని పురష్కరించుకొని నిర్వహించిన భాగవత పద్యాల గానం, సుమతీ, వేమనశతక పద్యాలు, బాలగేయాలు, వ్యాసరచన, కథారచన, కధలు చెప్పడం, కవితా రచన మొదలైన విభాగాలలో బహుమతులు పొందిన విజేతలకు శ్రీమతి లలిత గారి చేతులుమీదుగా బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీ డి. యల్. పి. రాజు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు మరియు విద్యార్ధులు పాల్గొన్నారు.