విజ్ఞాన దేవతగా, వివేక ధాత్రిగా బ్రహ్మనాలుకపై నర్తించే చదువులతల్లి సరస్వతీదేవి. ఈమె హిందూ పురాణాలు ప్రకారం మాఘమాసం శుక్లపక్షం ఐదో తిధిన వసంత పంచమి నాడు జన్మించింది. కావున ఈరోజును సరస్వతీ దేవి పుట్టిన రోజుగా, వసంత పంచమిగా మనం జరుపుకుంటున్నాము. మన దేశంలో ఎన్నో ప్రాంతాలు సరస్వతీదేవిని ముగురమ్మల మూల రూపాలతో కొలుస్తారు. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఆదిలాబాద్ జిల్లా బాసరలో ఈమెను జ్ఞానసరస్వతీదేవిగా కొలుస్తారు. వివిధ ప్రాంతాల నుండి ఎందరో తమ తమ పిల్లలకు తొలి బీజాక్షరాలు దిద్దించుటకు నలుదిక్కుల నుంచి వస్తారు. ఈ రోజు శ్రీప్రకాష్ విద్యానికేతన్ లో చిట్టి పొట్టి చిన్నారుల నడుమ ఈ పండుగను ఎంతో ఘనంగా జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులు పండితులకు మాత్రమే సాధ్యమయ్యే శ్లోకాలను విద్యార్ధులు మృధు మధురగానంతో ఆలపించారు. అదే విధంగా సరస్వతీ దేవి గొప్పతనాన్ని గురించి ఉపాధ్యాయులు విద్యార్ధులకు వివరించారు. పుస్తకాలు, పెన్సిల్స్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.యల్.పి. రాజు గారు విద్యార్ధులను ఉద్దేశించి చక్కని సందేశాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ముగించడం జరిగింది.