తెలుగు కవి గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 29వ తేదీ నాడు తెలుగు భాషా దినోత్సవం శ్రీ ప్రకాష్ విద్యా నికేతన్ అన్నవరంలో సంబరాలు అంబరాన్ని అంటాయి .
" తీయనైన భాష మన తెలుగు భాష .
ముద్దులొలుకు భాష మన తెలుగు భాష."
ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు గౌరవనీయులు "శ్రీ కందర్భ భాస్కర శ్రీ రామచంద్ర మూర్తి " గారు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ తెలుగు భాష గొప్పతనం మరియు ఆంధ్ర కవుల ఔన్నత్యాన్ని గురించి విద్యార్థులకు తెలియజేశారు. విద్యార్థులందరూ మాతృభాష పట్ల ప్రేమ కలిగి బాల్యం నుండి తెలుగులో వ్రాయడం, మాట్లాడడం చదవడం బాగా నేర్చుకోవాలని తెలుగు యొక్క కీర్తిని నలుదిశలా వ్యాపించేలా శిక్షణ పొందాలని ఆశించారు. అదేవిధంగా పాఠశాలలో నిర్వహించిన సాహిత్య పోటీలో భాగంగా వ్యాసరచన, పద్య పఠనం , చిత్రలేఖనం పోటీలలో గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు ఆయన చేతుల మీదగా ప్రశంసా పత్రములు అందజేయడం జరిగింది. విద్యార్థినీ విద్యార్థులు వివిధ కవుల వేషధారణలో అలరించడం జరిగింది. తదనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయుల సమక్షంలో శ్రీభాస్కర శ్రీరామచంద్రమూర్తి గారికి ఘనంగా సన్మానం చేసి సత్కరించడం జరిగింది.