📰 Co-Curricular Sri Prakash 12 Sep 2026

పర్యావరణ పరిరక్షణకు శ్రీ ప్రకాష్ విద్యార్థులు కృషి

పర్యావరణ పరిరక్షణకు శ్రీ ప్రకాష్ విద్యార్థులు కృషి
Share this article

- మట్టి గణపతిని హోమ్ మంత్రి వంగలపూడి అనిత కు అందచేసిన శ్రీ ప్రకాష్ విద్యార్థులు
పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా గుర్తించి శ్రీ ప్రకాష్ విద్యార్థులు ప్రజలను జాగృతి చేయడం అభినందనీయమని హోమ్ మంత్రి అనిత అభినందించారు. క్యాంప్ కార్యాలయంలో  శ్రీ ప్రకాష్ విద్యార్థులు హోమ్ మంత్రి అనిత ను కలిసి మట్టి గణనాథుని ప్రతిమను అందజేశారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలను పూజించాలని, పర్యావరణాన్ని పరిరక్షిందాం నినాదంతో శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణిని హోమ్ మంత్రి స్వాగతించారు. విద్యార్థులు స్వయంగా తయారు చేసిన మట్టి  విగ్రహాన్ని అనితకు అందజేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులు చేస్తున్న ప్రయత్నాన్ని ఆమె  అభినందించారు. గత ఇరవై ఏళ్లుగా  తమ విద్యార్థులు తుని, పాయకరావుపేట జంట నగరాల నందు అధికారులకు, ప్రజాప్రతినిధులకు, నాయకులకు, తల్లిదండ్రులకు ఈ విగ్రహాలు ఉచితంగా అందించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ కు తమ వంతు కృషి చేస్తున్నామని తెలిపారు.