వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ |
నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ॥
శ్రీ ప్రకాష్ విద్యాలయంలో మట్టి వినాయకుడిని తయారుచేసే కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు మట్టి వినాయకుడిని ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి హాని కలగకుండా పండుగ జరుపుకోవచ్చని, పత్రులలోని ఔషధ గుణాలు మరియు పర్యావరణ ప్రయోజనాలను కూడా అర్ధం చేసుకున్నారు.
ఈ సంధర్భంగా విద్యార్ధులు 21 రకాల పత్రుల ప్రత్యేకత,
ఔషధ గుణాలు, ప్రకృతి మన జీవితంలో ఉన్న ప్రాముఖ్యతను గుర్తించారు.
మట్టి వినాయకుడిని ఉపయోగించడం ద్వారా
నీరు, మట్టి, మరియు ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుసుకున్నారు.
మన సంప్రదాయాలను పర్యావరణ పరిరక్షణతో
అనుసంధానిస్తూ, ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యతను విద్యార్థులకు తెలియజేయడానికి ఇది ఒక మంచి సందర్భంగా నిలిచింది