📰 PRPeta SSC HS News 21 Nov 2025

గ్రంథాలయ వారోత్సవాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థుల ప్రతిభ

58వ గ్రంథాలయ వారోత్సవాలు పాయకరావుపేట శాఖ గ్రంధాలయంలో ఎంతో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాల పైన వివిధ పోటీలు నిర్వహించారు. దానిలో భాగంగా శ్రీ ప్రకాష్ విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని అత్య...

గ్రంథాలయ వారోత్సవాల్లో శ్రీ ప్రకాష్ విద్యార్థుల ప్రతిభ
Share this article

58వ గ్రంథాలయ వారోత్సవాలు పాయకరావుపేట శాఖ గ్రంధాలయంలో ఎంతో వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా వివిధ పాఠశాల విద్యార్థులకు వివిధ అంశాల పైన వివిధ పోటీలు నిర్వహించారు. దానిలో భాగంగా శ్రీ ప్రకాష్ విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి బహుమతులను కైవసం చేసుకున్నారు.
సీనియర్స్ క్విజ్ లో డి.ఎస్.కె. వైష్వంత్ 9 వ తరగతి, ఏ. తాన్షియా 8 వ తరగతి, డి. రోహన్ 8 వ తరగతి ప్రథమ బహుమతిని
టి మోహన్ 9 వ తరగతి, కె. గణేష్ పార్ధు 9 వ తరగతి, టి. శ్రీవైష్ణవ్ 8 వ తరగతి ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు.
పద్య పఠనం పోటీలలో సీనియర్స్ విభాగంలో 10వ తరగతి విద్యార్థిని డి. జ్యోతిర్మయి ప్రధమ బహుమతి, జూనియర్స్ విభాగంలో పి. రమా భవ్యశ్రీ 6వ తరగతి ప్రథమ బహుమతి సాధించారు.
భగవద్గీత శ్లోకాల పోటీలలో సీనియర్స్ విభాగంలో ఆర్. కార్తికేయ సునందన్ 8వ తరగతి, ద్వితీయ బహుమతి వి.నేహ 8వ తరగతి తృతీయ బహుమతి పొందారు.
పాటల పోటీలలో సీనియర్స్ విభాగంలో ఎల్ నవ్య 8వ తరగతి ప్రథమ బహుమతి సాధించింది. ఈ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాయకరావుపేట పట్టణ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పురుషోత్తం, గౌరవ అతిధిగా జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ తోట నగేష్ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్సై పురుషోత్తం మాట్లాడుతూ నేటి పోటీ ప్రపంచంలో పిల్లలు అందరూ ఉన్నతమైన జ్ఞానాన్ని ఆర్జించాలని దానికి అనువైనటువంటి వేదిక గ్రంథాలయం మాత్రమేనని కాబట్టి విద్యార్థులందరూ గ్రంథాలయాన్ని వినియోగించుకొని ఇక్కడ లభ్యమయ్యే పుస్తకాలను చదవడం ద్వారా పుస్తకాభిలాషను పెంపొందించుకోవాలని సూచించారు. అదేవిధంగా ఆడపిల్లలు తమ రక్షణ విషయంలో తగిన జాగ్రత్త వహించాలని, అపరిచితులైన వ్యక్తులను నమ్మవద్దని, వారు ఇచ్చే ఎటువంటి బహుమతులను స్వీకరించవద్దని, ఎవరైనా మీ పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే పోలీసులకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు తెలియజేయాలని అన్నారు. మీరు అందరూ ఈ గ్రంథాలయ పోటీల్లో పాల్గొని బహుమతులు పొందడం ఎంతో ఆనందదాయకమని ఈ సందర్భంగా విద్యార్థులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సభ్యులు, వివిధ పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.