📰 PRPeta SSC HS News 30 Aug 2025

గిడుగు అడుగుజాడల్లో నడుద్దాం తెలుగు భాష గొప్పతనాన్ని చాటుదాం-- పెద్దాపురం, మహారాణి కళాశాల విశ్రాంతాచార్యులు కృష్ణ బాబు

విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరు మాతృభాష మీద మమకారం పెంచుకోవాలని దేశభాషలందు తెలుగు లెస్స అనే నానుడిని నిజం చేయాలని ప్రముఖ సాహితీవేత్త, పెద్దాపురం మహారాణి కళాశాల విశ్రాంత ఆచార్యులు డాక్టర్ జోస్యుల కృష్ణబాబు అన్నారు. శ్రీ...

గిడుగు అడుగుజాడల్లో నడుద్దాం తెలుగు భాష గొప్పతనాన్ని చాటుదాం-- పెద్దాపురం, మహారాణి కళాశాల విశ్రాంతాచార్యులు కృష్ణ బాబు
Share this article

విద్యార్థి దశ నుండే ప్రతి ఒక్కరు మాతృభాష మీద మమకారం పెంచుకోవాలని దేశభాషలందు తెలుగు లెస్స అనే నానుడిని నిజం చేయాలని ప్రముఖ సాహితీవేత్త, పెద్దాపురం మహారాణి కళాశాల విశ్రాంత ఆచార్యులు డాక్టర్ జోస్యుల కృష్ణబాబు అన్నారు. శ్రీ ప్రకాష్ విద్యా సంస్థల యందు గిడుగు రామమూర్తి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని జరుపుకున్న తెలుగు భాషా దినోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యాసించారు. గ్రాంధిక భాషను వ్యవహారిక భాషలోనికి తీసుకురావడానికి శ్రీ గిడుగు రామమూర్తి గారు అహర్నిశలు కృషి చేశారు. ఆటవిక ప్రాంతాలలో తిరిగి ముండా జాతి తెగల భాష సవర భాషను నేర్చుకొని వారికి తెలుగు భాషను నేర్పించి ఎన్నో వ్యయ ప్రయాసలను కూర్చి సవర ఆంగ్ల నిఘంటువును రూపొందించడమే కాక తెలుగువారి అడుగుజాడ గురజాడ వారి సహకారంతో గ్రాంథిక భాష అయిన మన తెలుగును వ్యవహారిక భాషలోనికి తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారని గిడుగు వారి సేవలు అనన్య సామాన్యమైనవని కొనియాడారు మనం మాట్లాడే భాషకు రాసే భాషకు తేడా ఉందని గ్రహించి గ్రాంథికంగా ఉన్న తెలుగును వ్యవహార భాషలో తీసుకురావాలని సంకల్పించడమే ఉద్దేశ్యంగా పనిచేశారు ఒక భాషను సులభతరం చేయాలంటే సామాన్య విషయం కాదు అసమాన్యమైన విషయాన్ని సుసాధ్యం చేశారు. అందుకే ఆయన జన్మదిన ఆగస్టు 29 ని తెలుగు భాషా దినోత్సవం గా జరుపుకుంటున్నాం. ఆయన సేవలను తెలుగువారిగా మనమందరం కొనియాడదాం. తెలుగు భాషా గొప్పతనాన్ని నలు దిశలా వ్యాపింప చేద్దాం. ఎందుకంటే తెలుగు భాష ఎంతో గొప్పదని, ఇది మన ప్రాచీన భాషయని, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ గా తెలుగు భాషను అభివర్ణిస్తారని అన్నారు. చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సైతం తెలుగు భాషకు ఎంతో సేవ చేశారని, తెలుగు - ఆంగ్ల నిఘంటువును రూపొందించారని చెప్పారు. తెలుగులో ఎంతో సాహిత్యం ఉందని విద్యార్థులు అందరూ దానిని చదివి తెలుగు భాషలోని సౌందర్యాన్ని గ్రహించాలని చెప్పారు. తెలుగు భాషలో ని కొన్ని మధురమైన పద్యాలను పాడి వినిపించారు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ చరవాణికి బానిస అయ్యారని పుస్తకాన్ని దూరం చేసుకున్నారని అన్నారు. పుస్తకాన్ని చదివితే అపారమైన జ్ఞానాన్ని సాధించవచ్చని అదే చరవాణి వినియోగిస్తే కాలాన్ని వృధా చేసుకోవడమేనని అందువల్ల ప్రతి ఒక్కరూ పుస్తకాలను చదివే అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు చెప్పారు. ఇక్కడ విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రక్రియలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, పోతన పద్యాలను విద్యార్థులందరూ ఆలపించిన తీరు, సుమతి శతక పద్యాలను ఆలపించిన విధానం చాలా బాగుందని, సామెతలతో జరిగిన సరదా సంభాషణ తనను ఎంతగానో ఆకట్టుందని విద్యార్థులను కొనియాడారు. ఈ విద్యాసంస్థ తెలుగు భాషకు ఎంతగా ప్రాముఖ్యతనిస్తుందో తెలుసుకునేందుకు ఈరోజు జరుపుకున్న ఈ తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమం నిదర్శనమని చెప్పారు. ఇటువంటి చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన యాజమాన్యానికి ఉపాధ్యాయ బృందానికి తన అభినందనలు తెలియజేశారు . తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు కథలు చెప్పుట, బాల గేయాలు, ఏకపాత్రాభినయం, సుమతి మరియు పోతన భాగవత పద్యాల పోటీలు, వక్తృత్వం, డిబేట్, రామాయణం పై క్విజ్ తదితర పోటీలను నిర్వహించారు. వాటిలో విజయం సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథి డాక్టర్ కృష్ణ బాబు చేతుల మీద బహుమతులు ప్రధానం చేశారు. అనంతరం ముఖ్య అతిథి డాక్టర్ కృష్ణ బాబుని తెలుగు ఉపాధ్యాయ బృందం శాలువాతో సత్కరించి జ్ఞాపకాలు బహుకరించారు ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ స్పేసెస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ రామకృష్ణారెడ్డి , అకడమిక్ ఇన్-చార్జ్ లు శ్రీనివాస్, అపర్ణ, నీలాదేవి, సంధ్యారాణి, ఉషారాణి, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు